డాలరు చదువు
………
ఇదేమిటీ
ఎక్కడున్నదో గుండె ఇన్నాళ్ళు
కుదేలయి జల జల జారి పోతున్నది
నిర్లవనివ్వని మనసు
నిలవలేని కాళ్ళు
కళ్ళు కారు మేఘాన్ని తొడిగినట్లుంది
గొంతు ఊబిలో కూరినట్లుంది
ఎక్కడున్నాడు వీడు ఇన్నాళ్ళూ?
అమ్మ పొత్తిళ్ళూ వదిలి
నాన్న చాటును దాటి
పలకా బలపం పట్టిన బిక్క మొహం
దేశ సరిహద్దులు చెరిపి
నింగికెగిరిన విమానం
చిన్నప్పటి చందమామ కధళ్ళో
రాకుమారుని సాహస కృత్యాల్లా
సప్త సముద్రాలు దాటిన వైనం
కాలి నడకలు,అరన్య మార్గాలు మారాయేమో
దూరమైతే అంతే కదా
వున్నాడని
పక్కనే వున్నాడని
చిన్న పనికి
పెద్దపనికి
వెనక నిలబడే చిన్నతనం దాటి పోయి
అవసరమొ ఆలంబనొ
అర్ధం అయీ కాని ఆవేదనతొ
వినిపిస్తే మాటని
కనిపిస్తే చూపనీ
వెల్లువై బెంగటిల్లిన మనసు
మాట వినచ్చు
మనిషిని చూడచ్చు
నాణమైతే డాలరే కదా
ఇంటింటా ఇదే కదా
తల్లిదండ్రులదే వ్యధ
వరమొ
అవకాశమొ
ఏదైనా వాడి భవిష్యతత్తుకోసమే కదా
అనునయాలు,
సవఆంతన వాక్యాలు
మలాము పట్టీలులు ఎన్నో ఎన్నెన్నో
అయినా తడిసిన గుండెకు అతికేదెలా?
మే 23, 2007 sundaram000 చే
Hello your poem is good,